క్రీడాలతో ఆరోగ్యం ఆయుష్షు పెరుగుతుంది* -మినీ క్రికెట్ మైదానాన్ని ప్రారంభించిన ఎంపీపీ, సర్పం

Published: Monday February 20, 2023
చేవెళ్ల, ఫిబ్రవరి 18(ప్రజాపాలన):-

క్రీడలతో మానసిక ఉల్లాసాని పెంపొందించుకోవాలని చేవెళ్ల మండల పరిషత్ అధ్యక్షురాలు మల్గారి విజయలక్ష్మి రమణారెడ్డి అన్నారు. 
దేవుని ఎర్రవల్లి గేట్ సమీపంలో అత్తెల్లి అనంతరెడ్డి ఏర్పాటు చేసిన మినీ క్రికెట్ మైదానాన్ని శనివారం సర్పంచ్ బండారి శైలజ ఆగిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి, ఎస్సై హయ్యుంతో కలిసి ప్రారంభించారు. అలాగే అత్తెల్లి శేఖర్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఎంపీపీ,సర్పంచ్ మాట్లాడుతూ... యువత చదువుతోపాటు ఆటలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రతిరోజు క్రీడల కోసం కొంత సమయం కేటాయించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఉరుకులు పరుగుల జీవితంలో ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఆటలు ఒకటే మార్గమని తెలిపారు. క్రీడల వలన క్రీడాకారుల మధ్య స్నేహబంధాన్ని పెంపొందించుకోవాలి.
ఈ కార్యక్రమంలోభాజపా మండల పార్టీ అధ్యక్షుడు దేవర పాండురంగారెడ్డి,కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు దేవర సమత, అత్తిలి రాఘవేందర్, వైభవ్ రెడ్డి, శేఖర్ రెడ్డి  నరేష్,ప్రశాంత్,అరుణ్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.