కాశీలో విశ్వశాంతి యాగం కార్యక్రమం పోస్టర్ ను విడుదల చేయించిన కోలన్ శంకర్ రెడ్డి

Published: Wednesday August 11, 2021
బాలాపూర్: ఆగస్టు10, ప్రజాపాలన ప్రతినిధి : హైదరాబాద్లో పుట్టి, కాశీలో విశ్వ శాంతి యాగం చేపట్టిన, ఈ యాగం సఫలీకృతం జరగాలని హర్యానా రాష్ట్ర గవర్నర్ కోరుకుంటున్నట్లు... కోలన్ శంకర్ రెడ్డి పేర్కొన్నారు. బాలాపూర్ మండలం బాలాపూర్ గ్రామ నివాసి  బిజెపి సీనియర్ నాయకుడు మాజీ సింగిల్విండో చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి మంగళవారం నాడు ఉదయం హర్యానా రాష్ట్ర గవర్నర్ చండీగఢ్లో కలిసి శ్రీ ప్రహస్తా ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల ఆగస్టు 21, 22 లలో వారణాసి బెనారస్ లో మేము చేపట్ట పోతున్న విశ్వశాంతి యాగం కార్యక్రమం పోస్టర్ విడుదల చేయించి, (గవర్నర్) ను మీరు పాల్గొనగలరని విజ్ఞప్తి చేసి హృదయపూర్వకంగా కోరారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.... హైదరాబాదులో పుట్టి కాశీలో విశ్వశాంతి యాగం చేపట్టడం చాలా గొప్ప సంకల్పం అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికి అనుకూలంగా మంచి జరగాలని కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మ శాంతి, అలాగే ఆ కారణం వల్ల నష్టపోయిన వారికి మంచి జరగాలని కోరుకుంటూ ఈ యాగం చేపట్ట డాని అభినందిస్తూ, శ్రీ ప్రహస్తా ట్రస్ట్ చైర్మన్, కోశాధికారి, పీఠాధిపతి కలిసి చేస్తున్న యాగానికి దేవుడి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు హర్యానా గవర్నర్ తెలిపారని, వీలు చూసుకుని యాగంలో పాల్గొనేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సంస్థ చైర్మెన్, పీఠాధిపతి భైరవ స్వామి, కోశాధికారి కోలన్ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.