యంత్రప్రతిష్ఠ, పూర్ణాహుతి పూజలో పాల్గొన్న గోదావరి దంపతులు

Published: Monday August 01, 2022

వికారాబాద్  బ్యూరో 31జూలై ప్రజాపాలన : ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మికం తరణార్క ప్రభో శాంతం రామదూతం నమామ్యహం. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆలంపల్లిలో శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం, ధ్వజస్తంభం పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఆదివారం యంత్ర ప్రతిష్ట పూర్ణాహుతి తీర్థ ప్రసాదం మహాశీర్వచనం కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలంపల్లి గ్రామానికి చెందిన పుణ్య దంపతులు గోదావరి వెంకటేశం గోదావరి పుష్పలతలతో పాటు మాచన్న గారి సౌమ్య మాచన్న గారి సౌజన్యలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నూలి బసవలింగం పటేల్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు నూలే బసవంత రాజు పటేల్ జ్ఞాపకార్థంతో నిర్వహించిన శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వజస్తంభం పున ప్రతిష్టాపన కార్యక్రమాలు గత మూడు రోజుల నుండి భక్తుల సందడితో జరిగాయి. వేద పండితుల వేదమంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణమంతా ప్రతిధ్వనించాయి. ఆలంపల్లి గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులు పారి పంటలతో పాటు పశుపక్షాదులను ప్రజలను చల్లగా చూడాలని వేడుకున్నారు.