వైరా పోలీస్​ స్టేషన్ ను సందర్శించి రికార్డులను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

Published: Thursday June 16, 2022
ఖమ్మం జిల్లా వైరా పోలీస్​ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆకస్మికంగా సందర్శించారు.  పోలీస్ స్టేషన్​ నిర్వహణ, పోలీసుల పనితీరు,
పరిశీలించారు. స్టేషన్​ రికార్డులను తనిఖీ చేశారు.  పోలీస్​ స్టేషన్​ పరిసరాలను పరిశీలించారు. కేసుల వివరాలు, శాంతి భద్రతల ఆంశలపై వివరాలు పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని భద్రత పరమైన  చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. కొణిజర్ల - వైరా రహదారిపై  ప్రమాదాలు జరిగే హాట్‌స్పాట్‌
ప్రాంతాలను  సందర్శించాలని ప్రమాదాలు జరిగే ప్రదేశాలను 
సంబంధిత శాఖలతో సంప్రదించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు.
నేరాల నియంత్రణ, సీసీ కెమెరాల ఏర్పాటు,  గంజాయి వంటి మత్తు పధార్దాల అరికట్టడానికి స్ధానిక యువతను చైతన్య పరిచేందుకు చేపట్టిన అవగాహన కార్యక్రమాలపై వివరాలు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రధానంగా  విధినిర్వహణలో రాణించడంతో పాటు
ప్రజలకు మరింత మెరుగైన సేవలందించించేందుకు అమలవుతున్న ఫంక్షనల్  వర్టికల్స్ విధానంపై, 5s ఇంప్లిమెంట్ పై సిబ్బంది మరింత దృష్టి సారించాలని సూచించారు.
సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల ఫిర్యాదుల పరిష్కారానికి అవసరమైన  చట్టపరమైన చర్యలు త్వరితగతిన తీసుకోవాలని అదేశించారు. 
 
 
 
Attachments area