రాష్ట్ర బడ్జెట్ లో బీసీలకు అన్యాయం ** బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ ** కలెక్టరేట్ ఎదుట ధర్

Published: Tuesday February 14, 2023

ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 13 (ప్రజాపాలన,ప్రతినిధి) : రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు కేవలం 2 శాతం మాత్రమే కేటాయించినందుకు నిరసనగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం  జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్, అదిలాబాద్ ఎక్స్ రోడ్,లోని జ్యోతిబాపూలే విగ్రహం వద్ద ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించరు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు  రూప్నర్ రమేష్ మాట్లాడుతూ జనాభాలో దాదాపు 60 శాతం ఉన్న బీసీలకు కేవలం 2 శాతం మాత్రమే బడ్జెట్ కేటాయించి ప్రభుత్వం బీసీలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీలకు సరైన న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు గాజుల జక్కయ్య, వైరగడే మారుతి , కోట వెంకన్న,పురుషోత్తం బాలేష్,,రాధిక, లలిత ,ప్రహల్లాద్, గడ్డల ప్రణయ్, సాయి కృష్ణ, మిట్ట పోషన్న, లాహు కుమార్, ఆవిడపు ప్రణయ్,తదితరులు పాల్గొన్నారు.