పంట రక్షణకు కొండంత అండ తాడిపత్రులు

Published: Friday December 10, 2021

శివారెడ్డిపేట్ పిఏసిఎస్ చైర్మన్ ముత్యం రెడ్డి

వికారాబాద్ బ్యూరో 09 డిసెంబర్ ప్రజాపాలన : రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట రక్షణకు తాడిపత్రులు చాలా ఉపయోగకరంగా ఉంటాయని శివారెడ్డిపేట్ పిఏసిఎస్ చైర్మన్ మసనగారి ముత్యం రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రస్తుతం 50 తాడిపత్రులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పెద్దవి 24×30 సైజు గల 20 తాడిపత్రులు ఉన్నాయని వివరించారు. వీటి ధర రూ.2,800 లు. చిన్నవి 18×24 సైజు గల 30 తాడిపత్రులు ఉన్నాయని స్పష్టం చేశారు. వీటి రూ.1,790 లు. ఆసక్తి గల రైతు బంధువులు శివారెడ్డిపేట్ కో ఆపరేటివ్ సహకార సంఘానికి వచ్చి కొనుగోలు చేయాలని కోరారు. తాడిపత్రులపై ఎలాంటి సబ్సిడీ ఉండదని గుర్తు చేశారు. బయట మార్కెట్ లో లభించే తాడిపత్రుల ధరల కంటే తక్కువ ధరలకు లభిస్తాయని చెప్పారు. రైతుల అవసరాన్ని అనుసరించి తాడిపత్రులను ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంచుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమమే శివారెడ్డిపేట్ కో ఆపరేటివ్ సహకార సంఘం లక్ష్యం అన్నారు.