తెలంగాణ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలకు ఎంపికైన మాటూరు హైస్కూల్ విద్యార్థులు

Published: Saturday June 26, 2021
మధిర, జూన్ 25, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలంలోని మాటూర్ హైస్కూల్ కి చెందిన షేక్ రెహ్మాతున్నిసా, షేక్ బాజీ, షేక్ జాన్ పాషా లు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలు ఐనటువంటి వైరా, ఖమ్మం, దమ్మపేట జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యకు సీటు సంపాదించారని పాఠశాల హెచ్ఎం శ్రీ దీవి సాయి కృష్ణమాచార్యులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన కార్యక్రమంలో మధిర మండల విద్యాశాఖాధికారి శ్రీ వై ప్రభాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఉచిత జూనియర్ కళాశాలలో చక్కని సదుపాయాలతో కూడిన విద్య లభిస్తుందని, దీనిని నిరుపేద ప్రతిభ కల విద్యార్థులు వినియోగించు కోవాలని సూచించారు. ఈ కళాశాలలకు ఎంపికైన మాటూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ శ్రీ మేడిశెట్టి రామకృష్ణారావు, ఉపాధ్యాయులు సంక్రాంతి శ్రీనివాసరావు, కొలగాని ప్రసాదరావు, మేడేపల్లి శ్రీనివాసరావు, కంచిపోగు ఆదాము, రెంటపల్లి భాగ్య శ్రీనివాసరావు, వేము రాములు, మహమ్మద్ చాంద్ బేగం, గుంటుపల్లి రమాదేవి వేములపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.