వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర 3500 కి.మీ. పూర్తి

Published: Tuesday November 29, 2022
వైయస్సార్ టిపి అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ ఉప్పరి ప్రసాద్
వికారాబాద్ బ్యూరో 28 నవంబర్ ప్రజా పాలన : వైయస్ షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర 3,500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నదని వైయస్సార్ టిపి అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ ఉప్పరి ప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో వైయస్సార్ టిపి అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ ఉప్పరి ప్రసాద్ వైఎస్ఆర్ టిపి నాయకులతో కలిసి కేకు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని శుభాభివందనాలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఉప్పరి ప్రసాద్ మాట్లాడుతూ 
 తెలంగాణలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపట్టిందన్నారు. రాజన్న సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా వైఎస్ షర్మిల కృషి చేస్తుందని స్పష్టం చేశారు. గత ఏడాది అక్టోబర్ 20న చేవెళ్ల  నుండి ప్రారంభమైన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఉమ్మడి ఎనిమిది జిల్లాలు పూర్తిచేసుకుని ఉమ్మడి వరంగల్ జిల్లాలో తన ప్రజా ప్రస్థాన పాదయాత్రను  కొనసాగిస్తున్నారని వివరించారు. షర్మిల చేస్తున్న ప్రజాప్రస్థాన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు. చేవెళ్ల గడ్డ నుండి ప్రారంభమైన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఇప్పటివరకు 75 నియోజకవర్గాలలో కొనసాగిందిని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట వద్ద 3500 కిలోమీటర్ల వద్ద పైలాస్ ను ఆవిష్కరించారని ప్రసాద్ అన్నాడు. 222 రోజులలో  208 మండలాలు, 61 మున్సిపాలిటీలు,1863 గ్రామాలు, 4 ప్రధాన కార్పొరేట్లలో ప్రజా ప్రస్థాన పాదయాత్ర కొనసాగిందని తెలిపారు. వైయస్సార్ టిపి ఆవిర్భవించిన ఏడాదిలోనే వైయస్ షర్మిల ప్రజా క్షేత్రంలో అనేక పోరాటాలు చేశారని ఉప్పరి ప్రసాద్ గుర్తు చేశారు. పాదయాత్ర లోను తన ఉద్యమాలను ఆపలేదని 8 ఏళ్లుగా ప్రతిపక్షాలు పట్టించుకోకున్నా ప్రజలకు అండగా నిలిచారని వెల్లడించారు. కెసిఆర్ నియంత అవినీతి పాలనకు  వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశారని ఆయన అన్నారు. నిరుద్యోగ నిరాహార దీక్ష 38 వారాల పాటు నిర్విరామంగా కొనసాగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మండల్ వైఎస్ఆర్ టి పి అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, మర్పల్లి మండల అధ్యక్షుడు పిల్లోడి కర్ణాకర్, మోమిన్ పేట్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగిని కుమార్, వికారాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ శశివర్ధన్, అధికార ప్రతినిధి రమేష్, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాజు నాయక్, అధికార ప్రతినిధి వసంత్ కుమార్, మోమనిపెట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇసాక్, వికారాబాద్ టౌన్ క్రిస్టియన్ ప్రెసిడెంట్ బందెయ్య కార్యకర్తలు పి యాదవ రెడ్డి, ఎండి అజీమ్, మల్లేశం, నితిన్, సురేష్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.