భారతీయ జనతా పార్టీ బడంగ్ పేట్ కార్పొరేషన్లో కార్యవర్గ సమావేశం

Published: Thursday July 22, 2021
బాలాపూర్, జులై 21, ప్రజాపాలన ప్రతినిధి : పలు మోర్చా అధ్యక్షులు, సభ్యులు పటిష్టంగా ఉన్నప్పుడే పార్టీ బలోపేతానికి సహకారం ఉంటుందని కార్పొరేషన్ ఇన్చార్జి బోస్పల్లి ప్రతాప్ పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అల్మాస్గూడ ఏ.పీ పి ఆర్ గార్డెన్ లో కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట రెడ్డి ఆధ్వర్యంలో  కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా సెన్సార్ బోర్డు నెంబర్, వనపర్తి జిల్లా, బరంగ్ పేట్ కార్పొరేషన్  బిజెపి ఇంచార్జి బోస్ పల్లి ప్రతాప్, తో పాటు సీనియర్ నాయకుడు కోలన్ శంకర్ రెడ్డి హాజరయ్యారు, మాజీ సింగిల్ విండో చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ....., కార్పొరేషన్ లో పాలక వర్గం, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమస్యలను గాలికి వదిలేసి కేవలం శిలాపలకాలకె పరిమితం అయ్యారని. అనుచర గణం తో కేవలం కమీషన్ ల కొరకు పనులు చేస్తూ, సుందరీకరణ పేరుతో చెరువులు కుంటలు కాలువలు ఆక్రమిస్తున్నారని అన్నారు. బోసుపల్లి ప్రతాప్  మాట్లాడుతూ..... తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందన్నారు. దళితులకు, బడుగు బలహీన వర్గాల, సమాజం లోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. కార్పొరేషన్ లో 103 బూతులు ఉన్నప్పటికీ 93 బూతులు ఉన్న పలు మోర్చా అధ్యక్షులు, సభ్యులు పటిష్టంగా ఉండాలని చెప్పారు. సబాద్యక్షులు మాట్లాడుతూ... కార్పొరేషన్ పరిధిలో పార్టీ పటిష్టంగా అయిందని, భవిష్యత్తు కార్యాచరణ ద్వారా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాపయ్య గౌడ్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం మల్లారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు ఏనుగు రాంరెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు గడ్డం వెంకటేష్, బి జె వై ఎం రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ టేకుల భాస్కర్ రెడ్డి, ఓబీసీ ఎంబీసీ సెల్ కో కన్వీనర్ నడికుడి యాదగిరి, బి జె వై ఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామిడి సూరకర్ణ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు సుజాత గౌడ్, జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి కంటి భాస్కర్, కోశాధికారి చిత్రం నరేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు పాలుబాయ్ లక్ష్మణ్, రేస్ నర్సింహారెడ్డి, రామిడి మహేందర్ రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దడిగే శంకర్, మాజీ మండల అధ్యక్షులు తర్రె మల్లేష్ యాదవ్, కార్పొరేషన్ కార్పొరేటర్లు మాధురి వీరకర్ణా రెడ్డి, నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, గౌర రమాదేవి శ్రీనివాస్, గడ్డం లక్ష్మా రెడ్డి, మాజీ సొసైటీ బ్యాంక్ ఛైర్మెన్ పెత్తుల్లా పుల్లారెడ్డి, కార్పొరేషన్ పదధికారులు కార్పొరేషన్ మోర్ఛా అధ్యక్షులు బూత్ అధ్యక్షులు బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.