షాబాద్ :చేవెళ్ల: (ప్రజా పాలన)

Published: Tuesday April 04, 2023

 చేవెళ్ల నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని ముద్దెమ్ గూడ గ్రామము యందు వాహనాలను షాబాద్ పోలీసులు తనిఖీ చేయు సమయం లో కేట్టెల లోడ్ తో ఒక లారీ Br.No AP 12 U 1785 నెం. గలది వచ్చింది.వెంటనే షాబాద్ పోలీస్ సిబ్బంది అట్టి లారీ ని తనిఖీ చేయగా అట్టి లారీ లో అక్రమంగా సుమారు 10 టన్ను ల కట్టెలను తరలిస్తున్నారు.అయితే ఇట్టి లారీ డ్రైవర్ వివరములు హమీద్ S/o అబ్దుల్లా, Age: 56Yrs, Caste: ముస్లిం, Occu: Driver, R/o చంద్రనగర్,ఎక్కతపురం, హైదరాబాద్.అయితే ఇట్టి లారీ డ్రైవర్ నీ ఓనర్ వివరములు అడుగగా ఈ విధం గా తెలిపినారు. ఓనర్ వివరములు  లచ్చు నాయక్ s/o సంకు నాయక్ , Age:- 60 yrs, occ,:- బిజినెస్ (wood) R/o :- ఎల్లమ్మ తండా, మంచాల (M), RR dist.అయితే ఇట్టి లారీ డ్రైవర్ ని ఇట్టి కట్టెలను తరలించుటకు ఏవైనా ప్రభుత్వ అనుమతి ఉన్నాయా అని అడుగగా వారు ఎలాంటి అనుమతి చూపకపోవడం తో షాబాద్ ఇన్స్పెక్టర్ G. గురువయ్య గౌడ్ కేస్ నమోదు చేసి ఇట్టి లారీని కట్టెలను సీజ్ చేసినారు.