ఆర్కతల సర్పంచ్ వడ్డె రాములు గృహ ప్రవేశం

Published: Saturday December 17, 2022
వికారాబాద్ బ్యూరో 16 డిసెంబర్ ప్రజా పాలన : నవాబుపేట మండలం ఆర్కతల గ్రామ సర్పంచ్ వడ్డే రాములు గృహప్రవేశానికి శుక్రవారం పలువురు రాజకీయ ప్రతినిధులు హాజరయ్యారు. నూతన గృహప్రవేశం గ్రామ సర్పంచ్ వడ్డే రాములు, పుణ్య దంపతులు ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నూతన గృహప్రవేశానికి నిర్వహించాల్సిన పూజా కార్యక్రమాలన్నింటినీ పూజారులు గ్రామ సర్పంచ్ పుణ్య దంపతులతో మంత్రోచ్ఛారణలు చేయిస్తూ నిర్వహించారు. అనంతరం అతిథులకు భోజన కార్యక్రమాలు పూర్తి చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులు హితైషులు అభిమానులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.