ముంపు నీటి నిల్వలను తరలించేందుకు చర్యలు. ముంపు ప్రాంతం ను పరిశీలించిన సాగర్ కెనాల్ డీఈఈ మధు.

Published: Wednesday July 27, 2022
ముంపు నీటి నిల్వలను తరలించేందుకు చర్యలు.
ముంపు ప్రాంతం ను పరిశీలించిన సాగర్ కెనాల్ డీఈఈ మధు. 
 
 
పాలేరు జూలై 26 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
మండలం లోని రాజేశ్వరపురం గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్ద ఉన్న ముంపు నీటిని తరలించేందుకు చర్యలు చేపట్టారు. మంగళవారం సాగర్ కెనాల్ డీఈఈ మధు, సర్పంచ్ దండా పుల్లయ్యలు సందర్శించారు. నీటి తరలింపు ప్రత్యామ్నయం గురించి, తీసుకోవాల్సిన చర్యల పై చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దండా పుల్లయ్య మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇళ్ల బాధితుల కు నష్టం జరగకుండా చూడాలన్నారు. పై నుంచి వచ్చే వరద ను సాగర్ కెనాల్ లోకి వదిలే పనులు వెంటనే చేపట్టాలని సూచించారు. లేని పక్షంలో డబుల్ వద్ద నీళ్లు నిల్వ ఉండటం వలన ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా నిబంధనల మేరకు పనులు చేపట్టే అంశం ను జిల్లా అధికారులకు తెలియజేస్తానని 
డీఈఈ పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో సాగర్ కెనాల్ జెఈ ప్రవీణ్. మాజీ ఎర్ర బోయిన నరసయ్య తదితరులు పాల్గొన్నారు