బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

Published: Monday October 04, 2021
కోరుట్ల, అక్టోబర్ 03 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ లో కోరుట్ల మండలం మరియు పట్టణానికి చెందిన పలువురు లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా చీరల పంపిణీ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట నారాయణ, మున్సిపల్‌ చైర్మన్‌ అన్నం లావణ్య అనిల్‌, జడ్చిటిసి దరిశెట్టి లావణ్య రాజేష్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు చీటి వెంకట్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్‌ సురేష్‌ గౌడ్‌ పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్విండో చైర్మన్‌ లు, తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.