రాజ్యాంగ రూపశిల్పి బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి రావినూతల టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో

Published: Wednesday December 07, 2022

బోనకల్ ,డిసెంబర్ 6 ప్రజా పాలన ప్రతినిధి: భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా రావినూతల గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు, రావినూతల గ్రామ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు నేర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్‌ భారతదేశానికి లభించిన గొప్ప ఆస్తి. ఆయన ద్వారానే భారతదేశానికి గొప్ప ప్రజాస్వామ్యం అందింది. భారత రాజ్యాంగం ప్రధాన రూపశిల్పి డా బి ఆర్ అంబేడ్కర్‌. కుల, మత రహిత ఆధునిక భారత దేశం కోసం అంబేద్కర్‌ తన జీవితకాలం పోరాటం చేశారనీ,దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్‌ చేసిన పోరాటం మరువలేనిదనీ, అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని, చిన్ననాటి నుంచే తాను ఎదుర్కొన్న అంటరానితనాన్ని ఎవరూ ఎదుర్కోకూడదని అణగారిన వర్గాలకు అంబేద్కర్అండగా నిలబడ్డారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఇప్పటికీ చారిత్రాత్మకమైనవి. ఆ మహానుభావుడి వర్ధంతి సందర్భంగా ఆయనకు యావత్ భారతావని నివాళులు అర్పిస్తోందనీ అన్నారు... ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు తిరుపతిరావు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.