గర్భిణీ స్త్రీలకు సంపూర్ణ ఆరోగ్య సేవలు డాక్టర్ శశిధర్ ఆధ్వర్యంలో

Published: Wednesday July 13, 2022
ఉచిత వైద్య పరీక్షలు మధిర జులై 12 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో దెందుకూరు గ్రామంలో గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య సేవలు నార్మల్ డెలివరీ కోసంయోగాసనాలు వైద్య అధికారులు, పారామెడికల్ సిబ్బంది
 ప్రతి మంగళవారం పిహెచ్సి పరిధి లో ఏదో ఒక రెండు సబ్ సెంటర్స్ పరిధిలో ఉన్న గ్రామాలతో పాటు మధిర పట్టణంలో ఉన్న గర్భిణీ స్త్రీ లకు నిత్యం ఇంటింటికి పారామెడికల్ బృందం తిరుగుతూ గర్భిణీలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ఈ రోజు మధిర టౌన్ తో పాటు రాయపట్నం, ఖమ్మంపాడు, చిలుకూరు, తొండలగోపవరం దెందుకూరు ఇల్లెందులపాడు అంబారు పేట గ్రామల్లో ఉన్న గర్భిణీ స్త్రీలను 102 వాహనం ద్వారా మండలం పరధిలో పిహెచ్సి దెందుకూరు వైద్యులు డా. శశిదర్ ఆధ్వర్యంలో ఉచితంగా పరీక్షలు చేసి తగిన మందులు ఇచ్చి మరల వాహనం ద్వారా ఇంటికి పంపిస్తున్నారుఅదేవిధంగా ఎఎన్ఎమ్ లు ఆరోగ్యపర్యవేక్షణ సిబ్బంది గర్భిణీ స్త్రీల ఇంటి వద్దకు వెళ్లి నార్మల్ డెలివరీ ట్రిప్స్  యోగాసన పద్దతులు నేర్పుతున్నారు.
 ఈ కార్యక్రమంలో ఆయా పిహెచ్సి పరిధిలో సెక్టర్ వైజ్ ఆరోగ్య పరివేక్షకులు పిహెచ్ఎన్ గోళీ రమాదేవి  హెచ్ఇఒ సనప గోవింద్ హెచ్ఎస్ సుబ్బలక్ష్మి హెల్త్ విజిటర్ బి కౌసెల్య  హెచ్ఎస్ లంకా కొండ య్య ఎఎన్ఎమ్ లు వి విజయకుమారి భారతి  జయమ్మ  వై లక్ష్మి బి అరుణ  2వ ఎఎన్ఎమ్  ఆర్ విజయ లక్ష్మి , సునీలా రాణి,రాజేశ్వరి, విజయకుమారి, నాగమణి  హెల్త్ అసిస్టెంట్ లు జి శ్రీనివాస్ నాగేశ్వరావు,102 సిబ్బంది,వివిధ గ్రామల్లో పనిచేసే ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.