మోమిన్ పేట్ మండలంలో బిజెపికి బీటలు

Published: Wednesday January 25, 2023
వికారాబాద్ బ్యూరో 24 జనవరి ప్రజా పాలన : వికారాబాద్ నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగరవేయాలన్న లక్ష్యానికి ఆదిలోనే హంసపాదు ఎదురయ్యింది. మోమిన్పేట్ మండల పరిధిలోని బిజెపి పార్టీ ప్రధాన పదవులు నిర్వహిస్తున్న యువ నాయకులు ఒక్కొక్కరు తప్పుకుంటున్నారు. ముందుగా వెల్చాల్ గ్రామ సర్పంచ్ కుమారుడు మధుసూదన్ రెడ్డి బీజేవైఎం జనరల్ సెక్రెటరీ డాకూరి సాయిరాం రెడ్డి వికారాబాద్ జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ రాజీనామా బాట పట్టారు.
 ఓటు హక్కు వచ్చినప్పటి నుండి బిజెపి పార్టీకి ఓటు వేస్తూ ఇచ్చిన పదవులకు న్యాయం చేస్తూ వచ్చిన నాయకులకు బిజెపి జిల్లా నాయకత్వం మొండి చేయి చూపింది. మోమిన్ పెట్ మండలంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు అహర్నిశలు కష్టపడుతూ కష్టపడుతూ వచ్చిన కార్యకర్తలను చిన్నచూపు చూస్తున్నారు. పార్టీ జెండాను భుజస్కందాలపై మోస్తూ పార్టీ ప్రతిష్ట కొరకు కృషి చేసిన వారికి నిరాశ ఎదురైంది. కొత్తగా వచ్చినవారు పట్టించుకోవడంలేదని ఆవేదన చెంది బిజెపి పార్టీకి మండల బీజేవైఎం జనరల్ సెక్రెటరీ,  వికారాబాద్ జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు టేకులపల్లి గ్రామానికి చెందిన డాకూరి సాయిరాం రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా మోమిన్ పేట మండలంలో బిజెపి పార్టీకి కృషి చేస్తూ అందర్నీ కలుపుకొని ముందుకు కొనసాగామని తెలిపారు. మండలంలో బిజెపి పార్టీకి కష్టపడుతున్న వారిని పక్కనపెట్టి కొత్తవారిని ఆయా పదవులలో నియమించడంతో అసంతృప్తి రాజుకుంది. పార్టీకి తను చేసిన సేవలను మాజీమంత్రి చంద్రశేఖర్, వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు సదానంద రెడ్డి లు మేము సేవలను ఎప్పుడూ గుర్తించలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువల్లనే స్వచ్ఛందంగా  రాజీనామా చేస్తున్నట్లు డాకూరి సాయిరాంరెడ్డి తెలిపారు. తదుపరి రాజకీయపయనం ఎటు అనేది స్నేహితులతో కార్యకర్తలతో చర్చించిన అనంతరం నిర్ణయిస్తామని తెలిపారు. అభిమానులు తెలిపిన ప్రకారం టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు విశ్వనీయ వర్గాలు తెలిపారు.