ఆర్ డి వో కు వినతి

Published: Tuesday August 10, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిది మండల పరిధిలోని సంగం లోగల భీమ లింగం బ్రిడ్జిపై గుంతలను పూడ్చాలి ఆర్డి ఓ కు సిపిఎం వినతి భీమ లింగం బ్రిడ్జి పై గల గుంతలను వెంటనే పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి సంగం సిపిఎం శాఖ కార్యదర్శి బీమనబోయిన జంగయ్య లు భువనగిరి కి వెళుతున్న చౌటుప్పల్ ఆర్డీవో సూరజ్ కుమార్ కి బ్రిడ్జిపై కలిసి గుంతలను చూపించి వెంటనే వాటిని పూడ్చాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డిఓ సూరజ్ కుమార్ వెంటనే స్థానిక ఇరిగేషన్ అధికారి చంద్రశేఖర్ కు  ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించి ప్రత్యక్షంగా పరిశీలన చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆర్డీవో తో  స్వా మి,జంగయ్య లు మాట్లాడుతూ ఈ బ్రిడ్జి పై ఏర్పడిన గుంతల వల్ల ఈ రోడ్డు మార్గం ద్వారా ఇటు భువనగిరి జిల్లా కేంద్రానికి అటువైపు చౌటుప్పల్ ఆర్డిఓ కేంద్రానికి ప్రయాణించే ప్రయాణికులు రాత్రి సమయాల్లోనే  కాకుండా మధ్యాహ్నం పూట కూడా కింద పడి పోయే పరిస్థితి ఉందన్నారు.ఈ గుంతల నిండా ఎదుల్లగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ వాటర్ పైపు లీక్ కావడంతో తో నీరు చేరి బ్రిడ్జి పై నుండి పోతుందని దీని వల్ల గుంతలో నీరు చేరి ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే బ్రిడ్జి పై గల గుంతలు పూడ్చడంతో పాటు ఎదుల్లగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ లీకేజ్ అరికట్టాలని కోరారు. ఈ విషయంపై ఆర్డిఓ సూరజ్ కుమార్ స్పందిస్తూ కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ ఉండడంవల్ల అక్కడికే వెళ్తున్నానని కలెక్టర్ దృష్టికి భీమ లింగం బ్రిడ్జి పై గల గుంతల విషయం తీసుకుపోయి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.