చిలుకా నగర్లో ఘనంగా దసరా ఉత్సవాలు

Published: Friday October 07, 2022
మేడిపల్లి, అక్టోబర్ 6 (ప్రజాపాలన ప్రతినిధి)

 చిలుకానగర్ చౌరస్తాలో విజయదశమి ఉత్సవాలను దసరా ఉత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగాా నిర్వహించారు. విజయదశమి ఉత్సవాలలో భాగంగా జమ్మిపూజ, రావణ దహనం మరియు సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దసరా ఉత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గోనె శ్రీకాంత్ మాట్లాడుతూ చెడుపై మంచి రాక్షస ప్రవృత్తిపై దైవీ శక్తి మరియు అధర్మంపై ధర్మం సాధించిన విజయాన్ని వేడుకగా హిందూ సమాజం జరుపుకునే పండుగే విజయదశమి అని పేర్కొన్నారు. సమాజంలో ఉన్న చెడును అంతం చేసేందుకు మంచిని స్వీకరించేందుకు హిందువులు జరుపుకోనే పెద్ద పండుగ దసరా అని, ప్రజలందరికీ మంచి జరగాలని, ఈ విజయదశమి ప్రతీ ఒక్కరికి సకల  విజయాలను సిద్దింపజేయాలని ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా అందరం సంఘటితంగా ఐక్యతను చాటాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలుకానగర్ పెద్దలు మరియు మహిళాలు యువకులు దసరా ఉత్సవ సమితి సభ్యులు మడిపడిగే శ్రీనివాస్, డప్పు దత్తసాయి, ఉపేందర్ రెడ్డి, శ్రీనివాస్ చారి, రామరాజు, వెంకటేష్ యాదవ్, వైద్యుల వినయ్ రెడ్డి, సాయి కృష్ణ రెడ్డి, పలుగుల నరేష్ కుమార్, సుదర్శన్ రెడ్డి, దాసరి యాదగిరి, సునీల్ నాయక్, చిన్నబోయిన అనిల్ ముదిరాజ్, సుమన్ నాయక్, రేషం మనోజ్, తమ్మల సాయి కుమార్, వివిధ యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.