అధికారం రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట ప్రజాస్వామ్య విలువలను ఎటు వెళ్తున్

Published: Wednesday September 14, 2022

నాటి అసెంబ్లీ సమావేశం సందర్భంగా గవర్నర్ ప్రసంగం ఎందుకు లేదు అని ప్రశ్నిస్తే సస్పెండ్ చేశారు..
నేటి అసెంబ్లీ సమావేశంలో ఒక స్పీకర్ మరమనిషిలాగా కాకుండా స్వయంగా నిర్ణయం తీసుకోవాలి ..ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని అన్నందుకు..వివరణ కొరకుండానే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయించారు...
కానీ నిండు అసెంబ్లీలో నాటి గవర్నర్ నరసింహన్  మీద దాడి చేసినప్పుడు ఏమైనవి మీ సభామర్యాదలు...
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేవలము మూడు తోకలు మమ్మల్ని ఏమి చేయగలరు అని హేళన చేస్తున్నారు..
ఒకప్పుడు ఇదే ఈటల రాజేందర్ అరుతోకలను పట్టుకొని ఇదే అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారిని...ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని ఎదిరించినప్పుడు చప్పట్లు కొట్టిన వారికి...ఈరోజు తప్పుగా అనిపించిందా...
,అసెంబ్లీలో ఇలా ఒక సీనియర్ శాసన సబ్యులు..మాజీ మంత్రి వర్యులు ..తెలంగాణ రాష్ట్రం  కోసం ఎన్నో అవమానాలు భరించి ముందు వరుసలో ఉన్న ఈటల రాజేందర్  ని అవమాన పరచడం ముఖ్యమంత్రి కేసీఆర్  విజ్ఞతకు తగదు...రాజకీయ విభేదాలు ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి కానీ...మానసికంగా ఇలా ఇబ్బందులు పెట్టి ఆత్మగౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం చేస్తే ..మంచి పద్ధతి కాదు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఉద్యమ సమయంలో ఒక మాట అధికారం పీఠం ఎక్కిన తర్వాత మరొక మాట మాట్లాడుతున్నారు కేసీఆర్  ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు దగ్గర పడ్డాయి.