హనీ జాన్సన్ అరెస్టు అక్రమం

Published: Tuesday August 24, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 23 ప్రజాపాలన ప్రతినిధి : విశాఖపట్నంలో క్రైస్తవ మత ప్రభోదకుడు హనీ జాన్సన్ ని తెలంగాణ ప్రభుత్వం అరెస్టు అక్రమమని, ఆయన్ని వెంటనే విడుదల చేయాలని నియోజకవర్గపాస్టర్లు మరియు నాయకులు డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి రెమోరాండం అందజేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్స్ మాట్లాడుతూ సత్యం, న్యాయంకోసం మాట్లాడిన జాన్సన్ అరెస్టు చేయడం దారుణమన్నారు. వేరే మతాలవారిని అరెస్టు చేసే దమ్ము ఈ ప్రభుత్వాలకు ఉందా అని నిలదీశారు. మేం ఫిర్యాదు చేస్తే ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం పక్షపాతదోరణి విడనాడాలన్నారు. హనీ జాన్సన్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.చెరుకూరి రాజు పాస్టర్స్ సత్యం, సైమాన్ కరుణాకర్ సానుత్ రవి కుమార్, కృష్ణపల్, క్రిష్టపాలు, నాను నాయక్, దేవకుమార్, చార్లెస్ ప్రవీణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.