ఉత్తమ గ్రామపంచాయతీల ఎంపిక ప్రక్రియ పకడ్బంధీగా చేపట్టాలి. జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Thursday September 22, 2022


 

 

జాతీయ గ్రామపంచాయతీ అవార్డులు - 2023 కార్యక్రమానికి జిల్లాలో ఉత్తమ గ్రామపంచాయతీల ఎంపిక ప్రక్రియ పకడ్బంధీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ట్రైనీ కలెక్టర్ పి. గౌతమి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్ తో కలిసి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మండలానికి 3 ఉత్తమ గ్రామపంచాయతీలను ఎంపిక చేసి మొత్త 20 గ్రామపంచాయతీలను సిఫారసు చేసేందుకు ఆయా గ్రామపంచాయతీలలోని ప్రజల జీవన విధానం, ఆరోగ్యం, పిల్లలు, మహిళల రక్షణ, వనరులు సమృద్ధి, పారిశుద్ధ్యం, పచ్చదనం, స్వయం సమృద్ధి మౌళిక సదుపాయాలు, సాంఘిక భద్రత, పంచాయతీ కార్యక్రమాల నిర్వహణ తదితర అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ అంశాల ప్రకారముగా గ్రామపంచాయతీలకు మార్కులు కేటాయించడం జరుగుతుందని, ఎటువంటి పొరపాట్లకు తావు. లేకుండా మార్కుల కేటాయింపు జరుగాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.