పి. ఎం. ఈ. జి. పి. పథకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఎం.

Published: Saturday December 31, 2022
మంచిర్యాల బ్యూరో,  డిసెంబర్ 30, ప్రజాపాలన :
 
 
ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకాన్ని జిల్లాలోని ఔత్సాహిక యువతి యువకులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఎం.హరనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లాలోని చెన్నూరు మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో యువతి యువకులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని, ఈ సదస్సులో ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం విధి విధానాలు, పథకం వివరాలను కూలంకషంగా వివరించడం జరిగిందని తెలిపారు. ఈ పథకంపై యువతకు గల సందేహాలను నివృత్తి చేయడం జరిగిందని, ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి బి.శేషాద్రి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మహిపాల్ రెడ్డి, ఆర్. ఎస్ ఈ. టి. ఐ. సంచాలకులు లక్ష్మణ్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, సంబంధిత అధికారులు, యువతీ యువకులు పాల్గొన్నారు.