రాజ్యాంగంలో ఏమి మార్చాలి, ఎందుకు మార్చాలో కేసీఆర్ స్పష్టత ఇవ్వాలి

Published: Friday February 04, 2022
కలకోట మిత్రపక్షా పార్టీల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు
బోనకల్ ఫిబ్రవరి 3 ప్రజాపాలన ప్రతినిధి : హిందుత్వ ఎజెండాయే లక్ష్యంగా కేంద్రం రాజ్యాంగాన్ని మార్చాలంటుంది. మరీ కేసీఆర్ వైఖరి కూడా ఆ ఏజెండాలో బాగమేనా ఆయన ఉద్దేశ్యం ఏమిటో స్పష్టత ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టిన సందర్భంగా సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని వ్యాఖ్యానించారు ఏమి మార్చాలి ఎందుకు మార్చాలో ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఐ మండల పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ మార్గదర్శకాల మాటున రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించి నట్లుగా ఉందన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్బంగా సీఎం ఓ వైపు బీజేపీ పై గంభీరంగా మాట్లాడుతూనే మరో వైపు ఆర్ ఎస్ ఎస్ లక్ష్యాలను అమలు చేసే విధంగా ప్రస్తుత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పడం దుర్మార్గమన్నారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ ప్రజాస్వామ్య దేశం, గొప్ప రాజ్యాంగం మనది అని గతంలో వ్యాఖ్యలు చేసి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 లేకుంటే ఏ పాలకులు తెలంగాణ ఇవ్వలేకపోయే వాళ్ళని నాడు ఘంటా పధంగా చెప్పిన సీఎం నేడు నాలుక తాటి మట్టలాగా మారి ఇప్పుడు ఇంత దారుణంగా వ్యవహరించడాన్ని ప్రజలు ఖండించాలన్నారు. రాజ్యాంగంలోని ఏ అంశాలు ప్రస్తుతం పనికి రావో తేల్చాలన్నారు. పాత రాజ్యాంగం కోసం పరితపించే వారి ఆధ్యాత్మిక దైవం చినజీయర్ స్వామి కులాలు ఇలాగే ఉండాలి. ఏ కులం పని ఆ కులం చేయాలి అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందేనని, ఆయన ఆదేశాల మేరకే సీఎం మాట్లాడినట్లు విధితమవుతుందన్నారు. పాత రాజ్యాంగం అంటే మనుస్మృతి ఇది చాతుర్వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ దోపిడీ అణిచివేత నిరంతరంగా కొనసాగాలని ఉద్దేశ్య పూర్వక వ్యాఖ్యల లాగా ఉన్నాయన్నారు. కేసీఆర్ తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించు కోవాలని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ తరం కాదని వ్యాఖ్యానించారని కానీ వారి అసలు ఉద్దేశ్యం రాజ్యాంగాన్ని రద్దు చేయడమేనని చెప్పారు. కేసీఆర్ మాటలన్నీ మేకపోతు గాంబిర్యమే కానీ మధపుటేనుగు వలే బీజేపీ రాజ్యాoగాన్ని నులిపివేస్తుం దన్నారు. బీజేపీ విధానాలతో రాజ్యాంగానికి మరింత ముప్పు పొంచి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. మిత్రపక్ష ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్ ,సిపిఐ మండల పార్టీ కార్యదర్శి యంగల ఆనందరావు, కలకోట మత్స్య శాఖ అధ్యక్షులు బలుగూరి అచ్చయ్య, నాలుగో వార్డు సభ్యులు ధర్నాసి ఆంజనేయులు, మాజీ సర్పంచ్ తోటపల్లి సల్మాన్, మాజీ ఉపసర్పంచ్ బందెల ముత్తయ్య, సిపిఐ నాయకులు మాతంగి శ్రీనివాసరావు, కలకోట గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు జంగం రాజేష్, తోటపల్లి కోటి, దుంపల విజయ్ రాజు, యంగల ఆనందరావు, బాలయ్య, నారపోగు ఏసు, తోటపల్లి రత్నాకర్, చావల యేసుపాదం, మేకల అంజి జంగం ప్రవీణ్ బండి రాజేష్, రమేష్ అబ్బూరి అజయ్, కటికల శ్యామ్ బాబు తదితరులు పాల్గొన్నారు.