రైతు జీవితాలతో ఆడుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు...

Published: Thursday November 25, 2021
ఎర్రుపాలెం నవంబర్ 24 ప్రజాపాలన ప్రతినిధి : మండలంలో బుధవారం రోజున టిపిసిసి ఆదేశాల మేరకు రైతులు పండించిన వరి ధాన్యాన్ని తక్షణమే పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర ఇచ్చి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ తాసిల్దారు కి వినతి పత్రం అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు పక్కనపెట్టి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవటం ఆపి వరి ధాన్యాన్ని కొంటామని రైతులకు భరోసా ఇవ్వాలి. రైతుల బాధలు అర్థం చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రైతులు పండించిన వరి ధాన్యం పంటలను ప్రభుత్వం కచ్చితంగా కొనుగోలు చేయాలి. కానీ రాష్ట్రంలో ఎంత పంట వస్తుంది, ఎప్పుడు వస్తుంది అన్న వివరాలు ప్రభుత్వంలో వద్ద లేవు ముందస్తు ప్రణాళిక లేకుండా ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 50 లక్షల ఎకరాల్లో రబీ లో సాగుతుందని ప్రభుత్వ అంచనా రబీలో వరి సాగు వద్దని చెబుతున్నా ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలకు చెంది ప్రణాళిక లేదు. వరి పండే భూముల్లో ఇతర పంటలు పండించడం చాలా కష్టం. 62 లక్షల ఎకరాల్లో వరి వేశారని కోటి క్వింటాళ్లు ఉత్పత్తి వస్తుందని ప్రభుత్వం అంచనాలు ఉన్నాయి. పంట చేతికి వచ్చి నెల రోజులు అవుతున్న ప్రభుత్వం కేవలం 11 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది. రాష్ట్రంలో ఐకేపీ, సహకార సంఘాల ద్వారా 6,772 కొనుగోలు కేంద్రాలు తెరవాల్సి ఉండగా కేవలం 4,743 కేంద్రాలు పేరుకు ఓపెన్ చేశారు. ఇందులో సగం కూడా కొనుగోలు చేయలేదు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రాష్ట్రంలో రైతుల దగ్గర ఉన్న మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ధాన్యం కొనుగోలు చేయగానే వీరికి సకాలంలో డబ్బులు చెల్లించాలి. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి. రాబోయే రోజుల్లో సమగ్ర వ్యవసాయ విధానం అమలు చేసి ధాన్యం రైతులకు భరోసా కల్పించాలని, మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ కడియం శ్రీనివాస రావు, ఎన్నం పిచ్చిరెడ్డి, మధిర నియోజకవర్గ యూత్ యూత్ ప్రధాన కార్యదర్శి దేవరకొండ రాజీవ్ గాంధీ, మేరీ చెన్నయ్య, వేమిరెడ్డి కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.