ఘనంగా వాసవీ వారోత్సవాలలో పాత్రికేయులకు సన్మానం.

Published: Wednesday September 07, 2022
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్06, ప్రజాపాలన : 
 
మంచిర్యాల వాసవీక్లబ్స్ ఆధ్వర్యంలో వాసవీ వారోత్సవాల ఉత్సవాలను మంగళవారం మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. వాసవీక్లబ్ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వారోత్సవాలలో భాగంగా స్థానిక రెన్ సొసైటీ నిర్వహిస్తున్న అనాథ, వృధాశ్రమంలోని వారికి పండ్లు, అన్నదానం నిర్వహించారు. అలాగే వాసవీక్లబ్ కార్యదర్శి నలుమాను ప్రవీణ్ కుమారుడు వర్షిత్ పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ అనాథలకు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక సిపిఐ కార్యాలయంలో అంతర్జాతీయ పాత్రికేయ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులను సత్కరించి సమాజంలో పాత్రికేయ వృత్తి గురించి వివరించారు. ఈ సందర్భంగా వాసవీక్లబ్ క్యాబినెట్ కోశాధికారి పుల్లూరి బాలమోహన్, పాత్రికేయులు మాట్లాడుతూ, వాసవీక్లబ్ సమాజంలో చేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. పాత్రికేయులు కఠిన సమయంలో సైతం ఎన్నో ఓత్తిళ్ళకు గురవుతు నిజాలను వెలికితీస్తున్నారని అలాంటి వారిని గుర్తించి సత్కరించడం అభినందనీయం అన్నారు. అనంతరం ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తూ పలువురిని అత్యుత్తమ విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ  కార్యక్రమాలలో వాసవీక్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ, కార్యదర్శి నలుమాసు ప్రవీణ్, వనితా క్లబ్ అధ్యక్షురాలు గౌరిశెట్టి, ధనలక్ష్మి, కార్యదర్శి గంప వాసవి, కోశాధికారి కటకం సునీత, కప్పులబ్ అధ్యక్షుడు గడ్డం రమాదేవి రమేష్, క్యాబినెట్ కోశాధికారి పుల్లూరి బాలమోహన్, రీజియన్ చైర్మన్ వుత్తూరి రమేష్, జోన్ చైర్మన్లు కాచం సతీష్, కొంకుముట్టి వెంకటేశ్, నాగిశెట్టి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.