కార్పోరేటర్ శ్రీమతి లలితారాణి జార్జి చేతుల మీదుగా ఘనంగా సామూహిక శ్రీమంతాల వేడుక..

Published: Thursday April 21, 2022
పాలేరు ఏప్రిల్ 20 ప్రజాపాలన ప్రతినిధి బుధవారం ఖమ్మం రూరల్ మండలం 59వ డివిజన్ దానవాయిగూడెంలో గల 4 అంగన్వాడీ సెంటర్ల పరిధిలోగల గర్భిణీ స్త్రీలకు కార్పొరేటర్ తమ సొంత ఖర్చులతో ఘనంగా శ్రీమంతాల వేడుకను ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది  ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ శ్రీమతి బట్టపొతుల లలితారాణి జార్జి, మరియు బట్టపొతుల సతీష్, రజని. దంపతులు హజరై గర్భిణీ స్త్రీలకు వారి చేతుల మీదుగా బట్టలు, గాజులు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమలతో ఒడి నింపి ఆశిర్వదించారు కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ సత్యషీల, టీచర్స్ లక్ష్మీ, పద్మ, ఉమ, స్వర్ణ, నాగరాణి  జహిరాబి,. ముమ్మడి గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు.