నిరుద్యోగ భృతికై భారతీయ జనతా యువమోర్చా డిమాండ్

Published: Thursday January 20, 2022

రాయికల్, 19 జనవరి (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది నీళ్లు, నిధులు నియామకాల కోసమే, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కానీ నిరుద్యోగులకు ఉద్యోగం కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. నిరుద్యోగులకు ఉద్యోగలకై నోటిికేషన్లు విడుదల చేయలేదు. ఏం.ఎల్.సి ఎన్నికలలో నిరుద్యోగులతోని నిరుద్యోగ భృతి ఇస్తానని మాట ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఎవ్వలేదు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి నియామకాలు చేపట్టాలని భారతీయ జనతా యువ మోర్చ డిమాండ్ చేస్తూ రాయికల్ తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యువ మోర్చ మండల అధ్యక్షుడు ఆర్.మధుకుమర్, పట్టణ అధ్యక్షుడు చిలివెరి ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి పి. నరేష్, కోషనదికారి సింగు నవీన్, ఉపాధ్యక్షులు గుడికందుల ప్రదీప్, కటకం కిషోర్, శ్రీగద్దే సుమన్, సభ్యులు ఇల్లెందుల సాయి, కొట్టే రాజు, పవన్, శశి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.