గ్రూప్-2, 3, 4 పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు పి.

Published: Thursday January 19, 2023
 మంచిర్యాల భ్యూరో‌ ,  జనవరి 18, ప్రజాపాలన:
 
రాష్ట్ర షెడ్యూల్డ్ కులముల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించే గ్రూప్-2, 3, 4 సర్వీసెస్ కొరకు ఫౌండేషన్ కోర్సు కోసం ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ సంచాలకులు పి.రవీందర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్వాలిఫైయింగ్ పరీక్ష, డిగ్రీలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తూ జిల్లాలో 100 మంది షెడ్యూల్డ్ కులములకు చెందిన అభ్యర్థులకు నాన్-రెసిడెన్షియల్గా 3 నెలల కాలానికి స్పెషల్ ఫౌండేషన్ కోర్సు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఇందు కొరకు కేవలం ఆన్లైన్ ద్వారా www.tsstudycircle.co.in వెబ్ సైట్లో ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గం॥ల లోగా జిల్లాలోని అర్హత గల జనరల్ / ప్రొఫెషనల్ డిగ్రీ అభ్యర్థుల నుండి మాత్రమే దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. గతంలో ఫౌండేషన్ కోర్సు 5 నెలల ప్రోగ్రామ్న 11 టి.ఎస్.ఎస్.సి. స్టడీ సర్కిల్, స్టేట్ స్టడీ సర్కిల్ వద్ద సి.ఎస్.ఎ.టి., బి.సి. & ఎస్.టి. స్టడీ సర్కిల్స్ నందు శిక్షణ వినియోగించుకున్న అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణకు అర్హులు కారని తెలిపారు. వివరాల కొరకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభిశృద్ధి శాఖ ఉప సంచాలకులు కార్యాలయంలో, వెబ్ సైట్లో సంప్రదించవచ్చని, ఈ అవకాశాన్ని ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.