విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలి కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి

Published: Saturday December 10, 2022
మేడిపల్లి, డిసెంబర్ 9 (ప్రజాపాలన ప్రతినిధి)
విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి పేర్కొన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా పదో తరగతి విద్యార్థులే ఉదయం నుండి సమయసారిణి విధంగా విద్యార్థులకు విద్యాబోధన చేశారు. అనంతరం సాయంత్రం ప్రధానోపాధ్యాయులు సత్య ప్రసాద్ ఏర్పాటుచేసిన పరిపాలన దినోత్సవ సమావేశానికి ముఖ్య అతిథులుగా 25వ డివిజన్ కార్పొరేటర్  దొంతిరి హరిశంకర్ రెడ్డి పాల్గొని  మాట్లాడుతూ విద్యార్థులు సమయపాలన,క్రమశిక్షణ,కార్యదక్షత అలవడాలంటే పాఠశాల స్థాయిలో జరిగే కార్యక్రమాలు కీలకమని,విద్యార్థులు క్రమశిక్షణతో మంచి ఉన్నత చదువులు అవలంబించి ఉన్నత శిఖరాలను ఎదిగి తమ తల్లిదండ్రులకు పాఠశాలకు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు మంచి కీర్తిని తేవాలని తెలిపారు.తదనంతరం స్వపరిపాలన దినోత్సవంలో పాల్గొన్న పదవ తరగతి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయి కాలనీ అధ్యక్షులు రవీందర్ చారి, ప్రధానోపాధ్యాయులు సత్య ప్రసాద్, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.