రుతుస్రావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

Published: Saturday May 29, 2021
జగిత్యాల, మే 28 (ప్రజాపాలన ప్రతినిధి): రుతుస్రావ దినోత్సవం మే 28 సందర్భంగా యూనిసేఫ్ వారి జగిత్యాల జిల్లా వాలంతరి సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన పోస్టర్ ను ఆవిష్కరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వాహకులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ డీఎంహెచ్వో పుప్పాల శ్రీధర్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు రుతుస్రావం భారం కాదని అది ఒక వరం అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా రుతుస్రావంపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయని గ్రామీణ స్థాయిలో సైతం బాలికలకు మహిళా సంఘాలకు అవగాహన కల్పించడంపై ఎమ్మెల్యే నిర్వాహకులను అభినందించారు. కరోన కారణంగా జూమ్ యాప్ ద్వారా అవగాహన కల్పించడం కిశోర బాలికలకు ఉపాధి హామీ కూలీలకు మహిళా సంఘాలకు వాలంటీర్ల ద్వారా అవగాహన కల్పించడం మంచి పరిణామమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు సానిటరీ కిట్లను అందించిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కో-ఆర్డినేటర్ హరిణి జిల్లా వలంటీర్స్ అధ్యక్షురాలు మొన్నేని నీలిమ వాలంటీర్లు మనీషా చిరంజీవి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.