ఘనంగా మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

Published: Wednesday June 16, 2021
మధిర, జూన్ 15, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిర మధిర నియోజక వర్గ అభివృద్ధి ప్రదాత, రైతు భాంధవుడు మధిర నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ లీడర్ గౌరవనీయులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను ఈరోజు మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్, మిరియాల రమణ గుప్త ప్రత్యేకంగా తయారుచేసిన కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలను  నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మధిర మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు దారా బాలరాజు, సర్పంచ్  పులి బండ్ల చిట్టిబాబు,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి  రవికుమార్, intuc మధిర మండల అధ్యక్షులు కోరం పల్లి చంటి, మధిర పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షైక్ జహంగీర్, కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు, బొమ్మ కంటి హరిబాబు, ముస్లిం వెల్ఫేయిర్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ అలీ, సూర్యదేవర కోటేశ్వర రావు జింకల కోటేశ్వరరావు మైలవరపు చక్రి మొదలగువారు పాల్గొన్నారు.