త్వరలో సీఎం కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటను పరిశీలించిన ప్రభుత్వ విప్ పినపాక

Published: Thursday December 08, 2022
జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంతో పాటు, జిల్లా నూతన సముకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం..
సీఎం కేసీఆర్  చేతుల మీదుగా నాటడానికి  జమ్మి చెట్టు లు సిద్ధంగా ఉన్నాయని తెలిపిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రైటర్ బస్తీలోని ఎల్ఐసి ఆఫీస్ పక్కన నూతనంగా నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న  బిఆర్ఎస్ పార్టీ  కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు  సందర్శించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  మాట్లాడుతూ  పార్టీ అధినేత సీఎం కేసీఆర్  నాయకత్వంలో జిల్లాలలో  బిఆర్ఎస్  పార్టీ కార్యాలయాలు సకలంగులతో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నదని అన్నారు, పార్టీ బలోపేతం , కార్యకర్తల సమావేశాలు అవగాహన సదస్సులు నిర్వహించుకోవడానికి అధికార బిఆర్ఎస్  జిల్లా పార్టీ ఆఫీసులను నిర్మించుకున్నామన్నారు., సుమారు 1000 మంది పైగా కార్యకర్తలు కూర్చుని సమావేశం జరుపుకునేలా సౌకర్యవంతంగా వీటిని నిర్మించుకున్నామన్నారు, సమావేశం పార్కింగ్, వంటగది, స్టోర్ రూమ్, వాచ్మెన్ ,గదులు వీటిలో అందుబాటులో ఉన్నాయన్నారు, జిల్లా పార్టీ ఆఫీసులను అన్ని వసతులతో సౌకర్యంగా నిర్మించుకున్నామన్నారు, అన్ని ఆధునూతన హంగులతోనే నిర్మించడం జరిగిందన్నారు, వీటి ప్రారంభోత్సవం తర్వాత ఇక పార్టీ కార్యక్రమాలు కార్యకర్తల సమావేశాలు వీటిలోనే ఏర్పాటు చేయనున్న మన్నారు అనుకూలమైన స్థలాల్లో పార్టీ ఆఫీసులు నిర్మాణం చేసుకున్న నేపథ్యంలో పార్టీ సమావేశాలు ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా జరుగుతాయని పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు, సీఎం కేసీఆర్ గారితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంపుతో పాటు విద్య ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి అన్నారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం కేసీఆర్  పర్యటన త్వరలో తేదీలు ఖరారు కారు ఉన్నాయని వారన్నారు, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు. అందిస్తున్న ఏకైక రాష్ట్రం బిఆర్ఎస్  పార్టీ నే అన్నారు, సీఎం కేసీఆర్  తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు,