ధన్యవాదాలు తెలిపిన వికారాబాద్ పరిగి ఎమ్మెల్యేలు

Published: Monday August 02, 2021
వికారాబాద్ బ్యూరో 01 ఆగస్ట్ ప్రజాపాలన : నిరుపేద విద్యార్థులు చదువుకోవాలని ఆసక్తి ఉన్నా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలోని ఫీజుల మోతకు భయపడి ఇంటర్ చదువుతో మమ అనుకున్నారు. సిఎం కేసీఆర్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిల చొరవతో వికారాబాద్, పరిగి నియోజక వర్గాలకు డిగ్రీ కళాశాలను మంజూరు చేసి మేలు చేశారు. చదువుకునే హక్కు ప్రతి విద్యార్థికి కల్పించడం సంతోషదాయకమని పలువురు విద్యా ప్రముఖులు కొనియాడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ద్వారా సిఎం కేసీఆర్ కు విన్నవించారు. డిగ్రీ కళాశాలను తప్పక మంజూరు చేస్తామని శాసనసభా వేదిక సాక్ష్యంగా ఇచ్చిన హామీని నెరవేర్చిన సందర్భంగా సిఎం కేసీఆర్ కు, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లకు వికారాబాద్, పరిగి ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కొప్పుల మహేష్ రెడ్డి లు పుష్ప గుచ్ఛం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.