కేంద్రం ప్రభుత్వం బాధ్యతగా వ్యాక్సినేషన్ పంపిణీ చేయాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Published: Friday June 04, 2021
జగిత్యాల, జాన్ 03 (ప్రజాపాలన ప్రతినిధి) : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ఆయన నివాసం నుండి జూమ్ మీటింగులో మాట్లాడుతూ ఏఐసీసీ ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ త్వరగా అందరికి అందేల కార్యాచరణ సిద్ధం చెయ్యాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మరో నాలుగు నెలల్లో థర్డ్ వేవ్ ప్రభావం పొంచిఉన్న నేపథ్యంలో జూన్ జులై ఆగస్టు నెలల్లోనే అందరికి వ్యాక్సిన్ అందేల ప్రభుత్వాలపై ఒత్తిడికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం కావాలని అన్నారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు కరోనాకు ఉచితంగా చికిత్సలు అందిస్తున్నాయని ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నేటికీ చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. నిరుపేద వర్గాలు అప్పుల ఊబిలో చిక్కుకొని కుటుంబాలు చిన్నాభిన్నాం అవుతుంటే ఎవరి ఖర్మ వారిది అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమన్ని విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజలందరికి ఉచిత శస్త్ర చికిత్సలు అందించాలని ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వ్యక్తుల ఖర్చులను రియాంబర్స్ మెంట్ రూపంలో ప్రభుత్వం జిఓ విడుదల చెయ్యాలని అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రెసియాతో పాటు మరణించిన వారి కుటుంబల్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా నిరసన కార్యక్రమాలకి కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వాలని జూమ్ సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వివరించారు.