గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పూజారి పూజారి ఆత్మహత్యయత్నానికి పాల్పడడం పై ప

Published: Thursday March 30, 2023
బోనకల్, మార్చి 29 ప్రజా పాలన ప్రతినిధి:ఓ పూజారి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండల పరిధిలోనే చిరునోముల గ్రామంలో దుర్గాదేవి ఆలయము వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చిరునోముల గ్రామం లో దుర్గ ఆలయం లో గతంలో కే శ్రీనివాసాచారి పూజరి గా పని చేశాడు. అయితే ఆరు నెలల క్రితం భార్యతో కలిసి హుజూర్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస చారీ మంగళవారం సాయంత్రం తన మోటార్ సైకిల్ బాబుతో డబ్బులు తీసుకునేందుకు చిరునోముల వచ్చాడు. మంగళవారం తాను వచ్చిన పని పూర్తయింది. మరుసుట రోజు శ్రీనివాసచారిని హుజూర్ నగర్ పంపించి రావాలని ఆయన అనుచరులు భావించారు. ఈ క్రమంలో శ్రీనివాసచారి దుర్గమ్మ గుడి వద్ద గడ్డిమందు తాగి ఆత్మహత్నానికి పాల్పడ్డాడు. బుధవారం ఉదయం స్థానికులు చూసి వెంటనే 108కి సమాచారం అందించారు. 108 లో చావా భద్రయ్య శ్రీనివాసచారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగానే ఉందని తెలిసింది.
పూజారి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను మంగళవారం రాత్రి చిరునోముల వచ్చిన సమయంలో ఎటువంటి పురుగుమందు లేదు. తన సమస్య పరిష్కారం అయిన తర్వాత ఓ ఇంటి వద్ద ఉన్నాడు. కానీ తెల్లవారేసరికి దుర్గమ్మ గుడి వద్ద అపస్మారక స్థితిలో పడి ఉండటం, పక్కనే గడ్డి మందు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. చిరునోమలలో ఎటువంటి పురుగుమందుల షాపులు లేవు. పూజారి గడ్డి మందు ఎక్కడ నుంచి వచ్చిందనేది సంచలనముగా మారింది.