ధాన్యం కొనుగోలులో అవకతవకలను అరికట్టండి. సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదె కేశవరెడ్డి. అశ్వాపు

Published: Wednesday December 21, 2022

ఈరోజు  సీతారాంపురం  ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకాల్లో జరిగిన అవకతవకల గురించి మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదె కేశవరెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు సీతారాంపురం ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి 6 లారీల ధాన్యాన్ని  కాటాలు పెట్టి పంపించడం జరిగింది  ప్రతి 40 కేజీలు బస్తాకు రెండు కేజీల చొప్పున అధికంగా పెట్టి రైతుని మోసం చేస్తున్నారు  అట్టి మోసాన్ని గమనించిన రైతులు ఈరోజు రోడ్డు పైన ధర్నా చేయడం జరిగింది ఇప్పటి వరకు పంపించిన ధాన్యం కి సంబంధించిన రైతులకు అదనంగా పెట్టినటువంటి రెండు కేజీల డబ్బులు వారి అకౌంట్లో జమ చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్  చేస్తున్నాం .అంతేకాకుండా 1001 రకం దాన్యం కూడా కొనుగోలు చేయాలని ఒక రైతు గరిష్టంగా రెండు లక్షల వరకే ధాన్యాన్ని అమ్మాలడం సరికాదని ఆధార్ లింక్ కానటువంటి రైతులు పట్టా భూమి లేనటువంటి రైతులు కవులు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కొనుగోలు కేంద్రానికి వచ్చినటువంటి ప్రతి గింజను ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దనసరి సూర్య, అశ్వాపురం మండలం కాంగ్రెస్ అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య, రాసాల రామయ్య యూత్ కాంగ్రెస్ నాయకులు బొల్లినేని సురేష్, చందా వరప్రసాద్, యాకయ్య, వెంకటేశ్వర్లు, రైతులు  వెంకట్ రెడ్డి ,వెంకయ్య యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.