డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును వ్యతిరేకించటం సరైనది కాదు బహుజన సాధికారత సంస్థ వ్యవస్థాపక అ

Published: Friday May 27, 2022

బోనకల్, మే 26 ప్రజా పాలన ప్రతినిధి: ప్రస్తుతం జరుగుతున్న కోనసీమ అల్లర్ల విషయంలో కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరుని వ్యతిరేకించటం సరైనది కాదని బహుజన సాధికారత సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం పుల్లయ్య అన్నారు. మండల కేంద్రంలో మాట్లాడుతూ అగ్ర వర్ణ సామాజిక పార్టీలలో వున్న కొంత మంది నాయకులు దళితుల మీద అంబేద్కర్ మీద కపట ప్రేమ చూపిస్తూ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే అంబేద్కర్ పేరు వాడుకొని దళితుల ఓట్లను రాబట్టుకొని తర్వాత దళితుల పై దాడులు, అంబేద్కర్ పై కపట ప్రేమ చూపించటం తగదని ,అంబేద్కర్ కేవలం కొందరివాడు చిత్రీకరిస్తున్నారు అంబేద్కర్ ద్వారా రాయబడిన రాజ్యాంగం ద్వారా ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రజలు తమ హక్కులను ఉపయోగించుకొని స్వేచ్చగా బ్రతక గలుగు తున్నరంటే అది కేవలం అంబేద్కర్ మూలంగానే అదే విధంగా ఈనాడు ప్రజా ప్రతినిదులు గా చెప్పుకుంటున్న నాయకులు సైతం రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడిన సంగతి తెలుసుకోవాలని ఇప్పటికైనా బహుజన సమాజం అగ్ర వర్ణ కుల అహంకారన్ని గ్రహించంత కాలం బహుజన సమాజం విద్య, వైద్యం,రాజకీయంగా వెనక్కి నెట్టి వేయబడతారని తెలియ చేశారు. అదే విధంగా అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తి పేరు కోనసీమ కు పెట్టడం రెండు తెలుగు రాష్ట్రాలకు శుభపరిణామం అని తెలియ చేశారు.