గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలి, ఫెడరలిజం ను కాపాడాలి ** సిపిఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయ

Published: Friday December 30, 2022
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 29 (ప్రజాపాలన,ప్రతినిధి) : 
సిపిఐ పిలుపులో భాగంగా గురువారం కొమురం భీం అసిఫాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో గవర్నర్ వ్యవస్థ రద్దు కై, డిఫెండ్ ఫెడరలిజం డిమాండ్ లతో అంబేద్కర్ చౌక్ ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి గవర్నర్ కార్యాలయంను బిజెపి,ఆర్ యస్ యస్ కార్యాలయాలు గా మార్చి ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టడానికి ఉపయోగించుచున్నారని, గవర్నర్ లు బిజెపి పార్టీ వాళ్ళు గా వ్యవహరిస్తున్నారని, రాజ్జంగ వ్యతిరేక శక్తులు గా  మీరినందున గవర్నర్ వ్యవస్థ ను రద్దు చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తుందని అన్నారు. డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఏ ఆశయంతో రాజ్యాంగాన్ని రూపొందించారు. దానికి విరుద్ధంగా బిజెపి నడుస్తోందని, అసలు రాజ్యాంగాన్ని మార్చి వేయాలని, మత ఆధార రాజ్యాంగం కోరకు సన్నాహాలు చేస్తుందని అన్నారు. ప్రతి పక్ష నాయకులను లోంగదీసుటకు ఇ డి, ఐ టి, సి బి ఐ లను  ఉపయోగిస్తుందని రాజ్యాంగాన్ని పరి రక్షించే బాధ్యత  ప్రజలందరి దని అన్నారు. బిజెపి అబద్దాల కోరు, దగా కోరు పార్టీ అని, గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలని అన్నారు. భారత్ ను కష్టపడి ఒకటిగా ఉంచారని ఈ రోజు మతం పేరుతో భారత్ విడ గోట్టడాని ప్రయత్నం బిజెపి చేస్తున్నదని అన్నారు. *ఈ కార్యక్రమములో ఆత్మకూరి చిరంజీవి, ఎస్ తిరుపతి, భోగే ఉపేందర్, పిడుగు శంకర్, దుర్గం రవీందర్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, మల్లికార్జున్, పంచపూల* తదితరులు పాల్గొన్నారు.