డిసెంబర్ 18న ఛలో వరంగల్... మాలమహానాడు బహిరంగ సభ!

Published: Thursday October 20, 2022

శంకరపట్నం అక్టోబర్ 19 ప్రజాపాలన: హైదరాబాద్ లో శుక్రవారం మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అధ్యక్షతన  జాతీయ మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర విస్తృత సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా హాజరైన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డా‌‌.అద్దంకి దయాకర్  పాల్గొన్నారు.
అయన డాక్టరేట్ పట్టా పొందిన సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు  ఈ సమావేశం లో అక్టోబర్ 27న తెలంగాణ మాలమహానాడు ఆవిర్భావం సందర్భంగా అన్ని మండల జిల్లా కేంద్రాలలో గద్దెల నిర్మాణాలు చేపట్టి జెండా పండుగ జరుపుకోవాలని పిలుపు నిచ్చారు. మరియు ఈ డిసెంబర్ 18 న వరంగల్‌‌ లో 17వ వార్షికోత్సవం సందర్భంగా "మాలల బహిరంగ సభ ఏర్పాటు చేయలని
దళిత బందు లో సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ మాలమహానాడు ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో యంయల్ఏ లకు వినతిపత్రం ఇవ్వాలని తీర్మాణము చేసారని శంకరపట్నం మండల మాలమహానాడు నాయకులు తెలిపారు
ఈసమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి భైరి రమేష్, జాతీయ ఉపాధ్యక్షులు మన్నె బాబురావు, రాష్ట్ర కోఆర్డినేటర్ ర్యాకం శ్రీరాములు, రాష్ట్ర పొలిట్ బ్యూరో చైర్మన్ అశోద భాస్కర్, జాతీయ సభ్యులు గోలి సైదులు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య, ఉపాధ్యక్షులు చిప్పల నర్సింగరావు,సామల అశోక్,రాసూరి మల్లిఖార్జున్, రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాగరి వెంకటస్వామి, రాష్ట్ర కార్యదర్శి బుట్టి సత్యనారాయణ, నీరుడు అంజయ్య,తాళ్ళ వెంకటేష్,ఎలుక దేవయ్య,సాంబయ్య, జిల్లా అద్యక్షులు సంజీవ, శ్రీనివాస్,విజయ్,రవిందర్, శంకర్,జె.రాజు, రావుల శ్రీనివాస్,భవాని,అనిత, యాదగిరి,బాబు, తదితరులు పాల్గొన్నారు.