రక్తదానం ప్రాణదానముతో సమానం

Published: Wednesday May 25, 2022

నస్పూర్, మే 24, ప్రజాపాలన ప్రతినిధి: రక్తదానం చేయడం ప్రాణదానముతో సమానమని శ్రీరాంపూర్ సింగరేణి ఎంవీటీసీ మేనేజర్ కే వీ. రామారావు అన్నారు. మంగళవారం  తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల సహాయార్థం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల రక్త నిధి కేంద్రం,   సింగరేణి ఎంవీటీసీ  శ్రీరాంపూర్  ఏరియా ఆధ్వర్యంలో  రక్తదాన శిభిరం నిర్వహించారు. ఈ శిభిరాన్ని సింగరేణి ఎంవీటీసీ మేనేజర్ కేవీ. రామారావు ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తలస్సేమియా సికిల్ సెల్ వ్యాది గ్రస్తులకు ప్రతి 15 రోజులకు ఒక్కసారి రక్తాన్ని ఎక్కించ వలసి వస్తుంది, ప్రస్తుతం వేసవి కాలం కావడం తో తలస్సెమియా సికిల్ సెల్ పిల్లలకు, గర్భిణిలకు, అత్యవరస సమయంలో ఉన్న వారికి రక్తం అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రక్తదానం చేసిన వారిని అయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ రక్తదాన శిబిరంలో 41 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఇండియన్  రెడ్ క్రాస్ సొసైటి  జిల్లా  కమిటీ సబ్యుడు కాసర్ల శ్రీనివాస్, టీజీబీకేఎస్ ఏరియా ఉపాద్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, తలస్సెమియా వెల్ఫేర్ సొసైటి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్, వైద్యులు డా.  రంజిత్ కుమార్, రక్త నిధి సిబ్బంది పాల్గొన్నారు