సీఎం కేసీఆర్ ను కలిసిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు

Published: Saturday December 17, 2022
ప్రజాపాలన ప్రతినిధి.
ఈరోజు ఢిల్లీలో బిఆర్ఎస్  పార్టీ అధ్యక్షుడు& తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు  ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  మాట్లాడుతూ
తెలంగాణ గడ్డ మరో ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిందన్నారు, రాష్ట్ర రాజకీయాలలో బలమైన పార్టీగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన బిఆర్ఎస్ పార్టీ 
 రాబోయే రోజులలో చరిత్రను తిరగరాస్తుంద అని అన్నారు, తెలంగాణలో అమలవుతున్న ప్రజా సంక్షేమ, ప్రగతి విధానాలు బిఆర్ఎస్  వేదికగా దేశం మొత్తానికి పరిచయం అవుతున్నారు, దేశంలో రాబోయే రోజులలో గుణాత్మక మార్పుకు బిఆర్ఎస్ పార్టీ నాంది పలుకుతుందఅన్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్  దేశంలో మార్పు కోసం జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారని అన్నారు, ఆనాడు ఎలాగైతే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విప్లమాత్మక పందా ను అనుసరించారు అలాగే దేశ హితం కోసం నూతన రాజకీయ వరవడిని సీఎం కేసీఆర్ గారు ప్రారంభిస్తున్నారన్నారు, దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బిజెపి కాంగ్రెస్ కు పూర్తిస్థాయిలో మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయని, దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలతో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్  ఇప్పటికే చర్చలు జరిపారని అనేకమంది హేమా హేమీ నేతలు సీఎం కేసీఆర్  ఆలోచనతో ఏకీభవించారని కలిసి వచ్చేందుకు ఆసక్తి చెబుతున్నారని దేశంలో రాబోయే రోజుల్లో గురుణాత్మక మార్పుకు బిఆర్ఎస్  పార్టీ నాంది పలుకుతుంది  ఆయన అన్నారు.