మధిర లోకోణార్క్ ఎక్స్ప్రెస్ లో గంజాయి పట్టివేత

Published: Friday December 17, 2021
మధిర డిసెంబర్ 16 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో కోణార్క్ ఎక్స్ప్రెస్ నందు మధిర రైల్వే స్టేషన్ నుండి ఖమ్మం రైల్వే స్టేషన్ మధ్య అన్ని బోగీలను తనిఖీలు నిర్వహిస్తుండగా ఏసీ కోచ్ లోని B5 సీట్ నెంబర్ 21 వద్ద ఉన్న వ్యక్తి సాహూ s/o రామ హరి సాహూ, 22 సంవత్సరాలు, ఈరోజు  బరంపురం నుండి 27 కిలోల గంజాయి ను తీసుకొని ముంబాయిలో అవసరమైన వారికి ఎక్కువ రేటుకి అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనే ఉద్దేశంతో  .బరంపూర్ నుండి ముంబైకు ప్రయాణిస్తుండగా ఖమ్మం దగ్గరికి వచ్చేటప్పటికి పోలీసు వారు అనుమానంతో తనిఖీ చేసి నన్ను పట్టుకున్నారు. వెంటనే ఖమ్మం రైల్వే స్టేషన్ నందు దించి నారు. అతని వద్ద ఉన్న 2 బ్యాగుల నందు మొత్తం నాలుగు ప్యాకెట్లు ఒక్కటి సుమారు 6.5 కిలోలునందు సుమారు 27 కేజీల పాక్షికంగా ఎండిన గంజాయి ఉన్నది. దీనిని స్వాధీనం చేసుకొని కేసు రిజిస్టర్ చేసి పైన చెప్పిన వ్యక్తిని జ్యుడీషియల్ రిమాండ్ కు పంపడమైనదిఇట్టి గంజాయి విలువ సుమారుగా ఏడు లక్షలు గా ఉన్నది. పై అధికారులు అందరినీ ఎస్పి మరియు డిఎస్పీ గారు అభినందించారు