ప్రజలకు మెరుగైన వైద్య సేవలకు 30 పడకల ఆసుపత్రి ప్రారంభం ** రాష్ట్ర ఆర్థిక, వైద్య, శాఖ మంత్రి హరీష

Published: Friday December 30, 2022
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 29 (ప్రజాపాలన, ప్రతినిధి) : ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లాలోని కాగజ్ నగర్ లో గల ఎల్లా గౌడ్ తోటలో రూ 5 కోట్ల వ్యాయంతో 30 పడకల సామాజిక ఆసుపత్రి ప్రారంభించడం జరిగిందని, రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య వైద్య  సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి చాపర్ ద్వారా ఎస్పియం గ్రౌండ్లో దిగిన మంత్రులు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ, శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి లకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, పెద్దపెల్లి ఎంపీ  వెంకటేష్ నేత, జిల్లా పరిషత్ చైర్మన్ కోవ లక్ష్మీ, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు,లు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని ఎల్లారెడ్డి తోటలో నిర్వహించిన 30 పడగల ఆసుపత్రి నూతన భవనాన్ని ప్రారంభించారు.
 ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అధికార యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుందని, ప్రజలకు వైద్య సేవలు అందించడం కోసం 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. గర్భిణీలకు సరైన పోషక విలువలు అందించడం కోసం కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తుందని, గర్భిణీలకు ప్రసవం తర్వాత ఈ కిట్లు ఉపయోగపడతాయన్నారు. ప్రతి గర్భిణీకి రెండుసార్లు ఈ న్యూట్రిషన్ కిట్ అందించడం జరుగుతుందన్నారు. అసిఫాబాద్ లో ప్రజల సౌకర్యార్థం 340 పడకల ఆసుపత్రి నిర్మాణంతో పాటు వైద్య కళాశాల పాంభానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం రూ 100 కోట్ల అభయహస్తం, ఉచిత బస్ పాస్, పెన్షన్లు, అందించడం జరుగుతుందని అన్నారు.జిల్లా అభివృద్ధిలో జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం పనితీరు అభినందనీయమన్నారు. సాంస్కృతిక కళాకారులు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై పాడిన పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, రాజేశం, ఎస్పీ సురేష్ కుమార్, జిల్లా వైద్యాధికారి ప్రభాకర్ రెడ్డి, భీమ్రావు, డీఎస్పీలు  కరుణాకర్, శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది అధికారులు, ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.