ఆహార తయారీ, విక్రయ దారులు అనుమతి తీసుకోవాలి. .. డిప్యూటీ డియం అండ్ హెచ్ ఓ విజయ పూర్ణిమ

Published: Thursday March 02, 2023
మంచిర్యాల బ్యూరో, మార్చి 01, ప్రజాపాలన:
జిల్లాలోని ఆహార తయారీ, విక్రయ దారులు తప్పని సరిగా ఆహార భద్రత, భారతదేశం యొక్క స్టాండ్ అథారిటీ వారి అనుమతి తీసుకోవాలని డిప్యూటీ డియం అండ్ హెచ్ ఓ  విజయ పూర్ణిమ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో   ఆమె మాట్లాడుతూ  ఎవరైనా ఆహార ఉత్పత్తి, విక్రయ దారులు సంబంధించిన అనుమతి పోయిందని యెడల  ఫుడ్ సెక్యూరిటీ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆక్ట్ 2006 ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.  ఆహార ఉత్పత్తుల విషయంలో నాన్యత ప్రమాణాలు తప్పనిసరి పాటించాలని అన్నారు. అనుమతుల విషయంలో కానీ నాన్యత లేని ఫుడ్ విషయం లో తమకు నేరుగా పిర్యాదు చేయాలని సూచించారు. 
 
* జిల్లాలో 98శాతం పూర్తైన సర్వే
 
ఆహార ఉత్పత్తుల, విక్రయాలకు సంబంధించిన వ్యాపార సంస్థల గుర్తింపు కు సంబంధించిన సర్వే జిల్లాలో 98శాతం పూర్తి చేసినట్టు ఆమె తెలిపారు. 7 మునిసిపాలిటీ లలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాలో 3382 ఆహార విక్రయ వ్యాపార సంస్థలు ఉండగా 436 రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఇంకా 2446 వ్యాపార సంస్థలు అనుమతి తీసుకోవలసి ఉందని తెలిపారు. వీరంతా వారం రోజుల లో రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిఇయండి బుక్క వెంకటేశ్వర్, సిఐటిఒ లింగారెడ్డి పాల్గొన్నారు.