శ్రీరాంపూర్ జిఎం ఆఫీస్ సాక్షిగా ఎస్టేట్ అధికారుల ఆగడాలు. * భూ నిర్వాసితులకు అందని నష్టపరిహా

Published: Saturday September 03, 2022
మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 02, ప్రజాపాలన: 
 
 
శ్రీరాంపూర్ జిఎం కార్యాలయం సాక్షిగా ఎస్టేట్ అధికారులు ఇస్తారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు పలు విమర్శల కు దారి తీస్తుంది. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ భూ నిర్వాసితులకు అందవలసిన నష్టపరిహారం చెల్లింపు లో చేతివాటం ప్రదర్శిస్తున్నారని విమర్శలు వచ్చిపడుతున్నాయి. అధికారులు అయినవారికీ అనుకూలంగా వ్యవహారిస్తూ ఫ్లాట్స్ కేటాయింపు చేస్తూ 
న్నారట. ఎస్టేట్ ఆఫీస్ లో కీలకంగా వ్యవహరిస్తున్న క్లర్క్ తనను ఆశ్రయించిన వారికి నచ్చిన చోట ఫ్లాట్స్ కేటాయిస్తూ అందిన కాడికి తీసుకొని ప్లాట్ మార్పులకు సహకరిస్తున్నాడని బహిరంగ విమర్శలు వస్తున్నాయి.ఐతే  భూ నిర్వాసితులకు కేటాయించిన ప్లాట్స్ వాటి నెంబర్స్, కాలి ప్లాట్స్ వాటి నెంబర్స్ వారి వద్దనే ఉంచుకొని సంబంధిత రెవెన్యూ అధికారులకు సహితం చెప్పడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారిని మచ్చిక చేసుకున్న వారికి  మాత్రం నచ్చిన చోట కాలి ప్లాట్స్ వివరాలు చెబుతూ ప్లాట్ మార్పులు చేస్తున్నారట.ఇదీలా ఉండగా  శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ భూసేకరణలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణ సమయంలో స్థానికంగా లేనివారిని కూడా పరిగణలోకి తీసుకొని వారికి ప్రభుత్వం నుంచి రావలసిన నష్టపరిహారాన్ని అందించి,  అర్హులకు నష్టపరిహారం చెల్లించడంలో పలు కారణాలను సాకుగా చూపిస్తూ సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తింపించుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అర్హులు, అనర్హులను పరిగణలోకి తీసుకొని అర్హులైన భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందించవలసిన సంబంధిత అధికారులు ఒకరిపై ఒకరు తమ పరిధి కాదు అంటు దాటవేస్తు కలిసి పోయి కథ నడుపు తున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇట్టి విషయమై జిల్లా కలెక్టర్ ను, సంబంధిత అధికారులను, స్థానిక  శాసనసభ్యులను, ప్రజా ప్రతినిధులను పలుమార్లు కలిసి సమస్యను తెలిపిన పరిష్కరించే దిశగా పలు మార్లు సమావేశాలు ఏర్పాటు చేసిన ఫలితం లేదని పలువురు వాపోయారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ భూ నిర్వాసితులకు అందవలసిన నష్టపరిహారాలను వెంటనే అందించాలని బాదితులు కోరుతున్నారు. లేనియెడల నష్టపరిహారం అందని వారందరంతా ఏకమై    ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరింస్తున్నారు.
 
 
 
Attachments area