గ్రీన్ ఇండియా షాలేంజ్ ప్రోగ్రాంలో భాగస్వాములు కండి - డిప్యూటీ సీఈవో శ్రీలత

Published: Friday February 12, 2021
సారంగాపూర్, ఫిబ్రవరి 11 (ప్రజాపాలన): సారంగాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో జడ్పీ డిప్యూటీ సీఈవో శ్రీలత మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సర్పంచులు ఎంపీటీసీలు కార్యదర్శులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 17 న పుట్టినరోజు సందర్భంగా ప్రతి గ్రామంలో వెయ్యి మొక్కలు తప్పకుండ నాటాలని ప్రజాప్రతినిధులకు అధికారులకు  సూచించారు. గ్రీన్ ఇండియా లక్ష్యంగా  ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోల జమునశ్రీనివాస్ ఎంపీడీఓ పుల్లయ్య  వైస్ ఎంపీపీ సోల్లు సురేందర్ ఎంపీవో శశికుమార్ సర్పంచులు గుర్రాల రాజేందర్ రెడ్డి బొడ్డుపల్లి రాజన్న పాంపర్తి లక్ష్మీ ఎంపీటీసీ జోగినపల్లి సుధాకర్ రావు వివిధ గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు.