టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేద్దాం

Published: Tuesday February 01, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 31 ప్రజాపాలన ప్రతినిధి : టిఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలవంతమైన శక్తి గా తీర్చిదిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేయడం పార్టీ శ్రేణులకు జిల్లా పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. క్యాంపు కార్యాలయంలో మండల మున్సిపల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు ఎంపీపీలు జెడ్పీటీసీలు. ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీకి చెందిన చైర్మన్లు ఎంపీపీ జడ్పిటిసి సర్పంచ్లు ఎంపిటిసిలు కౌన్సిలర్లు డైరెక్టర్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు ప్రజాప్రతినిధులు అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రజలతో మమేకమై పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు ఆకాంక్షించారు ఈనెల 9న మంత్రులు కేటీఆర్ ఆర్ ఆర్, సబితా ఇంద్రారెడ్డి, నియోజకవర్గంలో 233 కోట్ల అభివృద్ధి పనులకు కి శంకుస్థాపన చేయడానికి విచ్చేయనున్నారు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం అనంతరం టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. త్వరలో పార్టీ అధినేత క సీఎం కెసిఆర్ ఆర్ పర్యటన కూడా ఖరారు అవుతుందని జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభించడంతో పాటు పండ్ల మార్కెట్ భూమిపూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల మున్సిపల్ పార్టీ సమావేశం వివిధ నిర్వహించాలని అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలని ఆయన సూచించారు. కేటీఆర్ పర్యటన లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పారు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్య వెంకట రమణ రెడ్డి గుంటూరు ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి చందు, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, చెవుల స్వప్న, ఎంపీపీ కృపేశ్ యాచారం జడ్పిటిసి చిన్నోళ్ళు జంగమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు చిలక బుగ్గ రాములు,  కర్నాటి రమేష్ గౌడ్, చీరాల రమేష్, కిషన్ గౌడ్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి సిద్ధాంతి కృష్ణారెడ్డి, కొప్పు జంగయ్య, అమరేందర్ రెడ్డి.