ప్రతి కార్మికుడికి భీమా... పెన్షన్ ఇవ్వాలి

Published: Friday February 05, 2021
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ మండల కమిటీ తేజస్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్  ఫెడరేషన్ క్యాలెండర్ ను మహేశ్వరం నియోజకవర్గం బిజెపి ఇన్చార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ రాములు యాదవ్ తో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ...              
వృత్తిదారులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
రాష్ట్రంలో ఎలక్ట్రీషియన్స్ సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రతీ ఇంట్లో, వీధుల్లో ఏదైనా విద్యుత్ సమస్య తలెత్తితే మొదటగా ఫోన్ కాల్ వెళ్లేది ఎలక్ట్రీయన్స్ కే అన్నారు. వృత్తిధర్మంలో ప్రాణాలు కోల్పోతున్న వారిని ఆదుకోవటంలో ప్రభుత్వం పట్టింపు లేదన్నారు. ప్రతీ టెక్నిషీయన్ కు కార్మిక బీమా కల్పించి ఆదుకోవాలన్నారు. 50ఏళ్లు దాటిన ప్రైవేట్ కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పారు. కులానికో భవనం కట్టిస్తామంటూ మాయమాటలు చెప్పిన సీఎం కేసీఆర్... వృత్తిదారుల సంఘాలకు ప్రతీ మండలానికో కార్మిక భవనం కట్టించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మీర్ పేట కార్పొరేషన్ అధ్యక్షుడు పెండ్యాల నర్సింహా, బడంగ్ పేట కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి సహా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం.కృష్ణ, జనరల్ సెక్రటరీ ఏ.శివకుమార్, బీ మోహన్ రెడ్డి, సునీల్ కుమార్, కే.భీమేష్, టీ.మహేశ్వర్, కే.కరుణాకర్ రెడ్డి, కొండబాబు, పెంటయ్య, సాయిబాబా, అహ్మద్ పాష, జి.మహేందర్, కే.రాజేందర్ తోపాటు ముఖ్య నాయకులు, బాలాపూర్ ఎలక్ట్రీషియన్స్, టెక్నిషీయన్స్ పాల్గొన్నారు.