మహాత్మా గాంధీ ఆశయాలను సాధించాలి

Published: Monday October 03, 2022
 సర్పంచ్ విజయలక్ష్మిరాచయ్య 
వికారాబాద్ బ్యూరో 02 అక్టోబర్ ప్రజాపాలన : మహాత్మా గాంధీ ఆశయాలను సాధించాలని కోటమ్మర్పల్లి సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్య అన్నారు. ఆదివారం మర్పల్లి మండల పరిధిలో గల కోటమర్పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్య అధ్యక్షతన మహాత్మ గాంధీ 153వ జయంతి సందర్బంగా గ్రామ పంచాయతీలో సమావేశం ఏర్పాటు చేసుకొని గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బతుకమ్మ చీరలు మహిళలకు గ్రామ సర్పచ్, ఎంపీటీసీ, వార్డుమెంబర్ల చేతులమీదుగా పంపిణీ చేయడం జరిగింది.
అదేవిధంగా నూతనంగా మంజూరైన ఆసరా - వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్ల లబ్దిదారులకు డబ్బులు గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోటమర్పల్లి గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్య మాట్లాడుతూ వ్యక్తిగత పనులు ఉన్న రైతులు ఉపాధిహామీ ద్వారా చేపట్టే పనుల కొరకు గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని హితవు పలికారు. ఎవరికి వారు తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ స్పష్టం చేశారు. 3 సంవత్సరాల పై నుండి ప్రతి ఒక్కరి పిల్లల పేర్లు అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేయించాలని అవగాహన కల్పించారు. గ్రామంలో ఎవరికి ఎలాంటి ఆరోగ్యపరంగా ఇబ్బంది కలిగిన  మన ఆశా వర్కర్లకు వెంటనే చెప్పాలన్నారు. కోటపల్లి గ్రామానికి 1200 బతుకమ్మ చీరలు వచ్చినవని తెలిపారు. 79 మందికి కొత్తగా ఆసరా పెన్షన్లు మంజూరు అయ్యాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీకార్యదర్శి స్వప్న, ఎంపీటీసీ సుజాత వెంకట్ రెడ్డి, వార్డుమెంబర్లు, రవి, రాహుల్, జైహింద్ రెడ్డి, తుడుం పూలమ్మ, పోచారం నర్సమ్మ, అంగన్వాడీ టీచర్ అమృతమ్మ ,  ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీశైలం, సోషల్ మీడియా ఇంచార్జ్ రమేష్ గౌడ్, విఓఎ నర్సింహా, ఆశా వర్కర్లు కిష్టమ్మ, పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ నర్సింహారెడ్డి రెడ్డి, గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తహసీన్, గ్రామ టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు పోచారం రాజు, బాలరాజు, రాచయ్య, నర్సింహా, కారోబార్ సురేందర్ రెడ్డి, మహిళలు, యువకులు గ్రామ ప్రజలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.