సామూహిక ధ్యానం - సామాజిక న్యాయం - గురు విశ్వస్ఫూర్తి మార్గం సర్వదా అనుసరణీయం

Published: Tuesday February 23, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన: “ఆకాశంలో వద్దు ఆధ్యాత్మికం ఆచరణలో చూపాలి ఆ మహత్యం అంటూ శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి ఆదేశాలతో నడుపబడుతూ.. ఆధ్యాత్మిక విశ్వ గురువు, వైజ్ఞానిక ఋషి, పూర్ణ గురువులు శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతో నిర్వహింపబడుతున్న "ప్రస్థాన సాధన” కార్యక్రమంలో భాగంగా వారు సూత్రీకరించిన ఆసన ప్రాణాయామ ధ్యాన సాధనా ప్రక్రియను, మాఘ పౌర్ణమి  సందర్భంగా, ఈ నెల 21 నుండి 27 వరకు ప్రతీ రోజు ఉదయం 4:30 నుండి 7 గంటల వరకు, ఆన్లైన్ విధానంలో ఉచితంగా నేర్పబడుతుందని, ఈ ఉచిత ఆన్లైన్ 'ఆసన ప్రాణాయామ ధ్యాన' సాధన కార్యాక్రమాన్ని అందరూ సద్వినియోగ పరుచుకోవాలని, స్ఫూర్తి కుటుంబ సభ్యులు కోరారు. శారీరక ఆరోగ్యానికి ఆసనాలు, మనోశక్తి ఉన్నతికి ప్రాణాయామ, మానసిక పరివర్తనకు ధ్యానం ఉపయుక్తంగా ఉంటుందని చాటి చెప్పుతున్నారు. మంచి - చెడుగా ఉన్న మానవ సమాజంలో, చెడును తగ్గించి, మంచిని పెంచేవిధంగా, మానవత్వ వృద్దే ధ్యేయంగా, ఆత్మీయ సమాజ స్థాపనే లక్ష్యంగా శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు సాగిస్తున్న ఈ మహా యజ్ఞంలో, స్ఫూర్తి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతూ, ప్రజలలో చైతన్యం కలిగిస్తున్నారు. ఈ సాధనా ప్రక్రియ ద్వారా, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా, నేటి సమాజ పరిస్థితులలో నెలకొన్న ఈ వైరస్ ల బారి నుండి పూర్తిగా కాపాడుకోగలమని కార్యక్రమ నిర్వాహుకులు తెలియజేసారు. ఈ ఉచిత ఆన్లైన్ 'ఆసన ప్రాణాయామ ధ్యాన' సాధన కార్యాక్రమాన్ని అందరూ సద్వినియోగ పరుచుకోవడం ద్వారా, శ్రీశ్రీశ్రీ గురు విశ్వ స్ఫూర్తి వారు మానవాళికి అందించిన ప్రస్థాన సాధన వ్యక్తి మార్పుకు, తద్వారా కుటుంబ మార్పుకు మరియు సమాజ సంస్కరణకు ఉపయోగ పడుతుందని  స్ఫూర్తి కుటుంబ సభ్యులు తెలియజేసారు